బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించిన నేవీ | Sakshi
Sakshi News home page

బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించిన నేవీ

Published Mon, May 15 2023 6:14 AM

India fires BrahMos supersonic missile from Navy destroyer Mormugao - Sakshi

న్యూఢిల్లీ: బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. నేవీకి చెందిన గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ మర్ముగోవాపై నుంచి ప్రయోగించినట్లు ఆదివారం వెల్లడించారు. ఐఎన్‌ఎస్‌ మర్ముగోవాతోపాటు బ్రహ్మోస్‌ క్షిపణి కూడా దేశీయంగా తయారైనవేనని చెప్పారు.

సముద్రజలాలపై మన నావికాదళ శక్తిని, దేశ ఆత్మనిర్భరతకు చాటిచెప్పే పరిణామమని వివరించారు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంతో ఇది దూసుకెళ్లిందన్నారు. భారత్‌–రష్యా ఉమ్మడిగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూమిపై నుంచి సైతం ప్రయోగించేందుకు వీలున్న బ్రహ్మోస్‌ క్షిపణులను తయారు చేస్తోంది.

Advertisement
Advertisement