
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఫలితాల వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. 93.66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఇది 0.06 శాతం ఎక్కువ. 2024లో 93.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు కంటే బాలికలు 2.37 శాతం ఎక్కువ మంది పాసయ్యారు. బాలికలు 95%, బాలురు 92.63% ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 2371939 మంది విద్యార్థులు హాజరుకాగా, 2221636 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.79 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం టాప్‌లో నిలిచింది. విజయవాడ రీజియన్‌లో కూడా 99.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బెంగళూరు 98.90%, చెన్నై 98.71, పుణే 96.54 శాతం ఉత్తీర్ణత శాతంతో టాప్-5లో ఉన్నాయి.
జవహర్ నవోదయ విద్యాలయ 99.49%, కేంద్రీయ విద్యాలయ 99.45%, ఇండిపెండెంట్ స్కూల్స్ 94.17%, సంభోటా టిబెటన్ స్కూల్స్ సొసైటీ 91.53%, ప్రభుత్వ పాఠశాలలు 89.26%, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ 83.94%, ఉత్తీర్ణత సాధించాయని సీబీఎస్ఈ ప్రకటించింది.
చదవండి: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో విజయవాడ టాప్