పాట్నా: ఒకవైపు మహిళల రాజకీయ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విపరీతంగా చర్చలు నడుస్తున్న వేళ.. బిహార్ ఎంపీ పప్పూ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు పప్పూ యాదవ్. 90 శాతం మహిళల రాజకీయ జీవితం.. నాయకుల బెడ్‌రూమ్ నుంచే మొదలవుతోందంటూ అసభ్యంగా మాట్లాడారు.
రాజకీయ నాయకులంతా మహిళలపై కన్నేసి వారిని హింసిస్తున్నారని కొత్త వివాదానికి తెరలేపారు. మహిళల పట్ల రాజకీయ నేతల ప్రవర్తనకు సంబంధించి నిత్యం ఏదో ఒక నాయకుడి సీసీ టీవీ ఫుటేజ్ బయటపడుతూనే ఉందని, అమెరికా నుంచి భారత్ వరకూ అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోందని అసహ‍్యంగా మాట్లాడారు.
ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలపై బిహార్ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది, ఇది మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ కోరింది. మరొకవైపు పప్పూ యాదవ్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పప్పు యాదవ్‌ను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి పప్పూ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.
'Women start careers in men's bedrooms... 90% female Netas start this way.'
Despicable,outrageous comments by Pappu Yadav,abusing self made women politicians. Will @priyankagandhi sack this obnoxious misogynist or does she endorse his views?Disgusting ppl pic.twitter.com/7PDBhp5Nrv— Tuhin A. Sinha तुहिन सिन्हा (@tuhins) April 21, 2026


