అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

పూరిగుడిసె, మట్టి మిద్దెల్లో

నివాసముండే వారికి మొదటి ప్రాధాన్యం

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌/కోడేరు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొల్లాపూర్‌ ఆర్డీఓ కార్యాలయం, పెంట్లవెల్లి, కోడేరు మండల కేంద్రాల్లోని రైతువేదికలు, పెద్దకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు వివరాలపై ఆరా తీశారు. మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, వాటిలో నిర్మాణాలు పూర్తయినవి, నిర్మాణ దశలో ఉన్నవి, ఇంకా ప్రారంభంకాని ఇళ్ల వివరాలను అధికారులతో తెలుసుకున్నారు. పెంట్లవెల్లి మండలానికి దాదాపు 180 ఇళ్లు మంజూరుచేస్తే.. అందులో 50శాతం ఇళ్లు మాత్రమే నిర్మాణాలు చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభంకాని వాటిని గుర్తించాలని.. లబ్ధిదారులతో స్థానిక నాయకులు, అధికారులు మాట్లాడి, వారు వెంటనే నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. పూరిగుడిసె, మట్టి మిద్దెల్లో నివాసముండే వారికి మొదటి ప్రాధాన్యంగా ఇళ్లు మంజూరు చేశామని.. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గవ్యాప్తంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం కూడా పక్కా గృహాల నిర్మాణానికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. సమావేశాల్లో అడిషనల్‌ కలెక్టర్‌ దేవసహాయం, హౌసింగ్‌ పీడీ గోపాల్‌నాయక్‌, ఆర్డీఓ బన్సీలాల్‌, తహసీల్దార్లు మాఽ దవి, శ్రీనివాసులు, ఎంపీడీఓలు వెంకట్రావ్‌, వెంకటేశ్వర్లు, కొల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్‌ రహీంపాషా, నాయ ్డకులు హన్మంతునాయక్‌, ప్రతాప్‌గౌడ్‌, దండు నర్సింహ, రామన్‌గౌడ్‌, పిడమర్తి రవి, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్‌రావు, నక్క వేణుగోపాల్‌రావు ఉన్నారు.

కొల్లాపూర్‌లో టూరిజం ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. యాదాద్రి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కిషన్‌రావు, ఎన్‌ఐటీహెచ్‌ఎంఏ చైర్మన్‌ వెంకటరమణ, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ బుధవారం కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లిని కలిశారు. అనంతరం కొల్లాపూర్‌, సోమశిల, జటప్రోల్‌లోని పర్యాటక ప్రాంతాలను వారు తిలకించారు.

పెంట్లవెల్లిలో హార్టికల్చర్‌ కళాశాల నిర్మాణానికి మంత్రి స్థల పరిశీలన చేశారు. కళాశాలకు 25 – 35 ఎకరాల భూమి అవసరమని.. అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకులు గోపినాయక్‌, రామన్‌గౌడ్‌, గోవింద్‌గౌడ్‌, కబ్బీర్‌, నల్లపోతుల గోపాల్‌, నాగిరెడ్డి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, నరేష్‌, నాగరాజు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement