అవగాహన కల్పిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పిస్తూ..

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

అవగాహన కల్పిస్తూ..

మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్‌ జ్వాల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement