పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరికీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ములుగు మండలంలోని కోయగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బోయిని రాజయ్య ఇటీవల మరణించగా పీఆర్‌టీయూ సంక్షేమనిధి నుంచి మృతుని కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును శ్రీపాల్‌రెడ్డి అందజేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచినందుకు డీఈఓ సిద్ధార్థరెడ్డిని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డితో కలిసి పీఆర్‌టీయూ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీరంగం, సంఘం నాయకులు దేవులపల్లి సత్యనారాయణ, కె.రమేశ్‌, కాటం మల్లారెడ్డి, సూర్యనారాయణ, చెరుకుల ధర్మయ్య, ప్రభావతి, పెండ్యాల సలేంద్రం, ప్రమీల, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement