'స్టాలిన్'లో ఖుష్బు పాత్ర వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? | Senior Actress Aamani Rejected Stalin Movie Because Chiru Sister Role | Sakshi
Sakshi News home page

'స్టాలిన్'లో ఖుష్బు పాత్ర వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Apr 26 2026 7:30 AM | Updated on Apr 26 2026 8:03 AM

Senior Actress Aamani Rejected Stalin Movie Because Chiru Sister Role

ప్రముఖ సినీనటి ఆమని ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా  కొనసాగారు. 90వ దశకంలోని అత్యంత ప్రజాదరణ పొందిన తారలలో ఒకరైన ఆమని, మెగాస్టార్ చిరంజీవితో చేజారిన ఒక మూవీ గురించి ఇటీవల మాట్లాడారు. చిరంజీవితో తెర పంచుకోనందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని వెల్లడించారు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, 'స్టాలిన్' చిత్రంలో చిరంజీవి సోదరి పాత్ర మొదట తనకే ఆఫర్ చేయబడిందని ఆమని గుర్తుచేసుకున్నారు.

'స్టాలిన్'లో చిరంజీవికి సోదరిగా ఖుష్బు సుందర్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పాత్రలో నటించాలని మొదట చిత్ర యూనిట్‌ ఆమనిని సంప్రదించిందట.  ఆమె దానిని తిరస్కరించానని ఇలా చెప్పుకొచ్చారు. "నా కలల హీరోకి సోదరిగా నటించడం నేను ఊహించుకోలేకపోయాను. అందుకే ఆ పాత్రను తీసుకోలేదు. హీరోయిన్‌గా మాత్రమే చిరు పక్కన నటించాలని ఒకప్పుడు కలలు కనేదానిని.. కానీ, కుదరలేదు." అని ఆమె పంచుకున్నారు. ఆమె వెల్లడించిన విషయం ఇప్పుడు వైరల్ అయింది.

గతంలో కూడా చిరు సినిమా గురించి ఆమని పలు విషయాలు పంచుకున్నారు. చిరంజీవితో ఒక్క సినిమా అయినా సరే నటించాలనేది తన కోరిక అని , కానీ అది నెరవేరలేదని చెప్పుకొచ్చారు. అయితే ఒకటి రెండు సార్లు చిరు సరసన హీరోయిన్‌గా అవ‌కాశం వ‌చ్చిందని నిర్మాతలు కూడా తన  డేట్లు తీసుకున్నారని గుర్తు చేసుకుంది.  కానీ, చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో తనను తీసేసి మరో హీరోయిన్‌ను  తీసుకున్నారని బాధపడ్డారు.  కనీసం రామ్‌ చరణ్‌క్‌ మదర్‌గా ఛాన్స్‌ వస్తే తప్పకుండా చేస్తానని ఆమని చెప్పడం విశేషం.

ఆమని  తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి భారీ హిట్‌ సినిమాల్లో నటించారు.  ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ (1993) సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement