ఓటీటీలోకి మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘పోచమ్మ’..ఎక్కడ? ఎప్పుడు? | Pochamma web series OTT Streaming Date, Press Meet Highlights | Sakshi
Sakshi News home page

‘పోచమ్మ’లో అలాంటి కంటెంట్‌ ఉంది.. హడావుడి అవసరం లేదు : అర్జున్‌ అంబటి

Apr 16 2026 6:21 PM | Updated on Apr 16 2026 6:43 PM

Pochamma web series OTT Streaming Date, Press Meet Highlights

అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘పోచమ్మ’. శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మించిన ఈ సిరీస్‌కి రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. బుధవారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో నటుడు అంబటి అర్జున్ మాట్లాడుతూ  ‘కొన్ని కంటెంట్ లు ముందు సైలెంట్ గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ లో అలాంటి కంటెంట్ ఉంది. పోస్టర్ , టైటిల్ తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సిరీస్ కు మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ హీరోలు. ఆహా టీమ్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సిరీస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ లో ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా నటించారు. ఇలాంటి మంచి సిరీస్ కు హడావుడి అవసరం లేదు స్ట్రీమింగ్ కాగానే సక్సెస్ అందుకుంటుంది. ఈ నెల 17న ఆహాలో మా  ‘పోచమ్మ’ సిరీస్ తప్పకుండా చూడండి’అన్నారు.

నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ - ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ జెస్సీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం చిక్ మంగళూరులో చేశాం. ఈ సిరీస్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్ శృతి నాయుడుకి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే రమేష్ ఇందిర మంచి దర్శకుడి కాదు మంచి కోస్టార్ కూడా. నా కోస్టార్స్ అందరితో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను మీరంతా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.

నటి శ్రీ పూజ మాట్లాడుతూ - ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న మొదటి రోజే తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా సిరీస్ కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. ఈ సిరీస్ తమిళం, తెలుగులో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మిమ్మల్ని తప్పకుండా ఎంగేజ్ చేసేలా సిరీస్ ఉంటుంది’ అన్నారు.

ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ - ‘పోచమ్మ’ కథ విన్నప్పుడే ఈ సిరీస్ సక్సెస్ మీద మాకు నమ్మకం ఏర్పడింది. ఈ సిరీస్ చిత్రీకరణ మొత్తాన్ని పోచమ్మ తల్లే ముందుండి నడిపించింది అనిపించింది. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా పోచమ్మ తల్లి గుడి, విగ్రహాలు మాకు ఎదురయ్యేవి. మా టీమ్ అంతా డిస్కస్ చేసుకుని సీన్స్ చేశాం. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. మిమ్మల్ని ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంటుంది’అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement