పూరి జగన్నాద్-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ పోకిరి. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 28న 2006లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పోకిరి మూవీ డైలాగ్స్ ఓసారి గుర్తు చేసుకుంటున్నారు. రెండు దశాబ్దాలైనా పోకిరి డైలాగ్స్‌ను తెలుగు ఆడియన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.
తాజాగా స్వీడన్‌కు చెందిన నటుడు కర్ల్ స్వాన్‌బెర్గ్ పోకిరి మూవీ డైలాగ్‌ను రీ క్రియేట్ చేశాడు. ఆశిష్ విద్యార్థితో మహేశ్‌బాబు చెప్పే డైలాగ్‌ను రీ క్రియేట్ చేశాడు. మీ స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది..అనవసరంగా పుట్టావ్? అనే డైలాగ్ ఇప్పుడు విన్న గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో పూరి జగన్నాధ్ మాస్ డైలాగ్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. మరోసారి పోకిరి డైలాగ్‌ను విని మీరు కూడా ఎంజాయ్ చేయండి.


