
ముంబై: కరోనా మహమ్మారి సామాన్య జనాల నుంచి సెలబ్రిటీల వరకు అందరిని హడలెత్తిస్తుంది. తాజాగా బాలీవుడ్ పరిశ్రమలో అనేక సినిమాలలో నటించిన హిమానీ శివపురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో తెలిపింది. కాగా ఎవరైనా తనను కలిస్తే వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. హిమానీ 'ఘర్ ఏక్ సప్నా' వంటి ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అలాగే 'హమ్ ఆప్కే హై కౌన్', 'దిల్వాలే దుల్హానియా లే జయేంగే', 'పార్డెస్' వంటి అనేక చిత్రాల్లో హిమానీ నటించారు. అయితే కుచ్ కుచ్ హోతా హైలో రిఫాత్ బీ పాత్రకు మంచి పేరు వచ్చింది. కేవలం సినిమాలలోనే కాక టెలివిజన్ రంగంలో కూడా హిమానీ శివపురి మంచి నటనతో పేరు తెచ్చుకున్నారు.