మర్కారా చిత్రంలో నటుడు కాళీవెంకట్ హీరోగా నటించారు. గౌతమి హీరోయిన్‌గా నటించిన ఈచిత్రంలో రామమూర్తి, జయప్రకాశ్, రాధాకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు తాజాగా హర్కారా అనే చిత్ర విడుదల హక్కులను పొందారు. కలర్‌పుల్ బేటా మూమెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ అరుణ్ కాస్ట్రో దర్శకత్వం వహించి ప్రధాన పాత్రను పోషించారు. ఈయన ఇంతకు ముందు వీ1 మర్డర్ కేస్ అనే చిత్రంలో హీరోగా నటించారు.
కాగా మర్కారా చిత్రంలో నటుడు కాళీవెంకట్ హీరోగా నటించారు. గౌతమి హీరోయిన్‌గా నటించిన ఈచిత్రంలో రామమూర్తి, జయప్రకాశ్, రాధాకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది భారతదేశంలోని తొలి పోస్ట్‌మెన్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని చెప్పారు.
ఎలాంటి డిజిటల్ సౌకర్యాలు లేని కొండ ప్రాంతంలో అతను పడే అవస్థలు, ఆ ప్రాంత ప్రజల జీవన విధానమే హర్కాడా అని పేర్కొన్నారు. చిత్ర కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. షూటింగ్‌ను తేని పరిసర ప్రాంతాల్లో జరిపినట్లు చెప్పారు. రామ్ శంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ నెల 25వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


