గుడ్‌న్యూస్‌ తర్వాత తొలిసారి కనిపించిన దీపికా పదుకొణె (వీడియో) | Deepika Padukone Pregnancy after spotted in Mumbai airport | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌ తర్వాత తొలిసారి కనిపించిన దీపికా పదుకొణె (వీడియో)

Apr 28 2026 11:03 AM | Updated on Apr 28 2026 11:06 AM

Deepika Padukone Pregnancy after spotted in Mumbai airport

బాలీవుడ్ స్టార్ నటి  దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అయితే,  రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన తర్వాత తొలిసారిగా వారు కెమెరా ముందుకు రావడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించినప్పటికీ ముందుగా ఒప్పుకున్న సినిమాల కోసం ఆమె పనిచేస్తూనే ఉన్నారు.

అల్లు అర్జున్‌- అట్లీ మూవీ రాకాలో దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సీన్స్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఆపై షారుఖ్‌ ఖాన్‌ కింగ్‌ మూవీలోనే భాగమైన దీపికా.. ఒక భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో నటించేందుకు రెడీ అయిపోయిందట. దర్శకుడు  సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ కోసం షారుక్‌తో పాటు దీపిక కూడా సెట్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.

దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులకు 2024లో  దువా పదుకొణె సింగ్ అనే కుమార్తె  జన్మించగా.. ఇప్పుడు రోండో బిడ్డ వారి జీవితంలోకి రానుంది. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా సినిమా షూటింగులలో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement