ఘట్టమనేని జయకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ నుంచి మొదటి సాంగ్ తాజాగా విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు తనయుడే జయకృష్ణ.. ఇందులో ఆయనకు జోడీగా నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తుంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా 'అల్లెల్లే..' అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ సాంగ్‌ను జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తూనే ఆలపించారు. కొరియోగ్రఫీ ఆట సందీప్ అందించారు.


