మొలకొచ్చిన వడ్లను ఆరబెడుతున్న రైతు
ఆరుగాలం కష్టపడి వరి పండించిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. లారీల కొరత.. ధాన్యం తరలింపులో కాలయాపనతో వడ్లు కల్లాల్లోనే మూలుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తూకం వేసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల బస్తాల కిందకు నీరు చేరడంతో రంగుమారి మొలకలు వచ్చాయి. మెదక్, హవేళిఘణాపూర్ మండలాలకు సంబంధించిన ధాన్యం మంభోజిపల్లి ఎన్‌డీఎస్‌ఎల్ గోదాంకు తరలిస్తున్నారు. అక్కడ అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలిచిపోయాయి. హమాలీల సంఖ్య పెంచి అన్‌లోడింగ్ త్వరగా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
– హవేళిఘణాపూర్(మెదక్)


