ప్రకృతిని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిని కాపాడుకుందాం

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

నర్సాపూర్‌: ప్రకృతిని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్వాన్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మేఘన పిలుపునిచ్చారు. శనివారం సంస్థ ప్రతినిధులు, వాకింగ్‌ క్లబ్‌ సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అడవిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఏరివేత కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడినప్పుడే భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని వీలైనంత తక్కువ చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement