నర్సాపూర్: కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరగాల్సిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బీజేపీ కనుసన్నల్లో జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గంలోని బీఎల్‌ఏల అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి సంస్థగా కొనసాగేదని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కనుసన్నల్లోనే కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ బీఎల్‌ఏలు చురుకుగా పని చేయాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా పర్యవేక్షించాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని వివరించారు. అర్హుల పేర్లు తొలగిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, ఆయా మండల పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని చౌరస్తాలో ప్రధాని దిష్టబొమ్మను దహనం చేశారు. మోదీ పరిపాలనలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ ఆరోపించారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం


