తెప్పబోల్తా పడి మత్స్యకారుడి మృతి | - | Sakshi
Sakshi News home page

తెప్పబోల్తా పడి మత్స్యకారుడి మృతి

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

● కడెం ప్రాజెక్ట్‌ వద్ద ఘటన

కడెం: భారీ ఈదురుగాలులు, అలలకు తెప్పబోల్తాపడి మ త్స్యకారుడు నీట మునిగి మృతిచెందాడు. కడెం ప్రాజెక్టు వ ద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగుల రాజశేఖర్‌(54) మత్స్యకారుడు రోజులాగే శనివారం కడెం ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం భారీ ఈదురుగాలులు రావడంతో అప్రమత్తమై ఒడ్డుకు చేరే క్రమంలో ప్రాజెక్ట్‌లో భారీ నీటి అలలకు తెప్ప బోల్తాపడింది. ఈత కొట్టేందుకు ప్రయత్నించిన రెండు కాళ్లకు చేపల వల చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. భారీ ఈదురుగాలుల మధ్య ఎలాగైన ఒడ్డుకు చేరాలని కడెం ఎడమ కా లువ వైపు వేగంగా తెడ్డు కొడుతుండగా ఒడ్డునవా రు తీసిన వీడియో వైరలయ్యాయి. రాజశేఖర్‌ మృతిచెందడం అందరినీ కలిచివేసింది. కుటుంబ స భ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement