ఆదిలాబాద్: ఆర్టీసీలో ఉద్యోగుల విలీన ప్రక్రియ వే గంగా జరుగుతుందని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మిక సోదరుల చిరకాల స్వప్నం సాకారం కాబో తోందని పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన సమ్మె సందర్భంగా కార్మికులు లేవనెత్తిన అంశాలపై ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరి శీలించిందని తెలిపారు. ఇప్పటికే విలీనానికి సంబ ంధించిన ఆర్థిక, సాంకేతిక, పరిపాలనాపరమైన అ ంశాలపై సమీక్ష నిర్వహించిందని వెల్లడించారు. రా ష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మిక శాఖ పర్యవేక్షణలో యూ నియన్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల ప్రతిని దులను విలీన ప్రక్రియలో భాగస్వాములను చేస్తామని వివరించారు. కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో నిర్వహిస్తూ, సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


