క్రికెట్‌లో ఆణిముత్యాలు | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో ఆణిముత్యాలు

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో విద్యార్థుల్లో దాగిన ఉన్న క్రికెట్‌ నైపుణ్యాలను వెలికితీసి వారు క్రికెట్‌లో రాణించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌, మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో గతనెల 12వ తేదీన కోచ్‌ అజయ్‌ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రికెట్‌ శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందిచారు. ఈ శిక్షణ శిబిరాన్ని అడిషనల్‌ ఎస్పీ రియాజ్‌, ఉమ్మడి పాలమూర్‌ జిల్లా క్రికెట్‌ అసోషియేషన్‌ సెక్రెటరీ రాజశేఖర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌కుమార్‌ ప్రారంభించారు.

100మందికి శిక్షణ

స్థానికి మినీ స్టేడియంలో నిర్వహించిన సమ్మర్‌ క్యాంప్‌లో కోచ్‌ అజయ్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని గ్రామా ల్లో ఉండే క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి 100మందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ అండర్‌–12,14,19 విభాగా ల్లో ఇచ్చి 100మందిలో సత్తా చాటిన క్రీడాకారులను నారాయణపేట జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కాగా దీనికోసం అండర్‌–16 ఇంట్రో డిస్ట్రిక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను హెచ్‌సీఏ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల మధ్య జిల్లా కేంద్రంలోని స్థానిక బాలాజీ ఐటీఐ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించి జిల్లాస్థాయిలో సత్తా చాటిన వారిని ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఎంపిక చేసి అక్కడ సత్తా చాటిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.

క్రికెట్‌ ఆడుతున్న క్రీడాకారులు

క్రికెట్‌ శిబిరాన్ని ప్రారంభించి కిట్లు అందజేస్తున్న రాజశేఖర్‌(ఫైల్‌)

ఎంతో

ఉపయోగం

గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి శిబిరాలు ఎంతోగానో ఉపయాగపడతున్నాయి. నారాయణపేటకు చెందిన అఫాన్‌ గతంలో ఈ సమ్మర్‌ క్యాంపు ద్వారానే రాష్ట్రస్థాయికి ఎంపికై జడ్చర్లలో జరిగిన అండర్‌–17 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా శ్రీహరి కూడా ఈ క్యాంపు ద్వారానే శిక్షణ తీసుకొని నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.

వేసవి శిక్షణ శిబిరం నుంచి రాష్ట్రస్థాయికి..

జూన్‌ 10న ముగిసిన వేసవి శిక్షణ శిబిరం

మే 12నుంచి జూన్‌ 10వరకు నిర్వహణ

హెచ్‌సీఏ, ఎంసీఏ ఆధ్వర్యంలో 100మందికి తర్ఫీదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement