మావి ఇనాం భూములు. 73 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నాం. వీటిపైనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి. 2012లో దేవాదాయ భూమిగా మార్చారంటూ నష్టపరిహారం ఇవ్వట్లేదు. మా మాటలను లెక్కచేయకుండా మా పొలంలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు. మాకు పరిహారం అందే వరకూ మా పొలంలో పనులు చేయొద్దని ఆర్డీఓకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మాకు న్యాయం చేయాలి.
– వైజునాధ్, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట
పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి..
కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి,
కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట


