పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

డ్రగ్స్‌, పొగాకు ఉత్పత్తులపై నిఘా పెట్టాలి

నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ డి.జానకి

మహబూబ్‌నగర్‌ క్రైం: పోలీస్‌ స్టేషన్‌ వారీగా ఉన్న పెండింగ్‌ కేసులపై దర్యాప్తు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, కోర్టు ట్రయల్‌ ఉన్న కేసుల పురోగతిపై నిత్యం అప్‌డేట్‌ చేస్తుండాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట స్టేషన్‌ వారీగా నమోదైన కేసులు, పనితీరు, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో కేసులు, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్య సంస్థల పరిసరా ప్రాంతాల్లో, అనుమానిత ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ డ్రగ్స్‌, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, ఫోన్‌ కాల్స్‌, సోషల్‌ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా పెంచడంతో పాటు రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై దృష్టి సారించాలన్నారు. వారెంట్ల అమలు, పరారీలో ఉన్న నిందితుల అరెస్టులు, కమ్యూనిటీ పోలీసింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్‌, కమలాకర్‌, మహేష్‌, రామకృష్ణ. మోతీరాం, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

● ఇటీవల జిల్లాలో బదిలీపై నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్‌ఐలు శనివారం ఎస్పీ డి.జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే సీసీఎస్‌ సీఐగా ఉన్న కృష్ణయ్య నూతనంగా మహిళ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతో పని చేయాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement