రక్తదానంపై విస్తృత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

రక్తదానంపై విస్తృత ప్రచారం

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

ఒక వైద్యుడిగా ఉంటూ రక్తదానంపై విస్తృతంగా ప్రచా రం చేయడంతో పాటు నేను కూడా స్వతహాగా ఇప్పటి వరకు 21సార్లు రక్తదానం చేశాను. రెడ్‌క్రాస్‌తో పాటు అత్యవసరంగా ఉన్న సందర్భంలో నా దృష్టికి వచ్చిన ప్రతిసారి రక్తదానం చేస్తూ వచ్చాను. భవిష్యత్‌లో కూడా అవసరమైన వారికి రక్తం ఇస్తాను.

– డా.అశ్విని నవదీప్‌, మహబూబ్‌నగర్‌

ప్రాణాలు కాపాడాలి..

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకోసారి రక్తాన్ని ఇవ్వవచ్చు. నేను 21 ఏళ్ల వయసు నుంచి ప్రతి సంవత్సరం వరుసగా రక్తదానం చేస్తున్నాను. ఇప్పటివరకు 70 సార్లు రక్తదానం చేశాను. నా మిత్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నా. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము. కేవలం దాతల ద్వారానే సేకరిస్తాం. ప్రతి ఒక్కరూ రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా నిలవాలి. – రాధాకృష్ణ,

లయన్స్‌ క్లబ్‌ మాజీ గవర్నర్‌, నాగర్‌కర్నూల్‌

ఏ సమయంలోనైనా..

ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా రక్త దానం చేయడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేసినవారమవుతారు. నేను ఇప్పటి వరకు 10 సార్లు రక్తం ఇచ్చాను. ఏ సమయంలోనైనా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

– కొట్ర గోపాల్‌రెడ్డి, లెక్చరర్‌, కల్వకుర్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement