● అత్యవసర సమయంలో రక్తమిచ్చి ప్రాణాలు కాపాడుతున్న దాతలు
● ఏడాదికి రెండు, మూడుసార్లు రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న వైనం
● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడికి.. సర్జరీ కావాల్సిన రోగికి.. ప్రసవమయ్యే గర్భిణికి.. తలసేమియా బాధితులకు.. ఇలా అత్యవసరంగా రక్తం కావాల్సిన ప్రతి ఒక్కరికీ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు రక్తదాతలు. కొందరు ఒకటి, రెండుసార్లు ఇచ్చి.. ఇక ఆ తర్వాత రక్తదానం చేయడం ఆపేస్తారు. కానీ మరికొందరు ప్రతి ఏడాది రెండు నుంచి మూడు సార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర సమయంలో రక్తం కొరత లేకుండా చూస్తూ.. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – పాలమూరు/కందనూలు


