ఇప్పటికీ 32 సార్లు.. | - | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ 32 సార్లు..

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

మొదట 2010లో ఒకరికి ఓ–పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని తెలిస్తే వెంటనే రెడ్‌క్రాస్‌ వద్దకు చేరుకొని రక్తదానం చేశాను. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది రెండుసార్లు రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు 32 సార్లు రక్తదానం చేశాను. మా పిల్లల పుట్టి న రోజుతో పాటు ప్రతి ఏడాది డిసెంబర్‌లో నేను పనిచేసే బ్యాంకులో రక్తదాన శిబిరంలో తప్పక చేస్తుంటాను. ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడం వల్ల అత్యవసరంగా ఉన్న వారికి ఉపయోగపడుతుంది. – రజినీకాంత్‌, మహబూబ్‌నగర్‌

సహాయ ఫౌండేషన్‌ ఏర్పాటు..

మా నాన్నకు డయాలసిస్‌ రావడం.. అత్యవసరంగా రక్తం లభించకపోవడంతో చనిపోయారు. దీంతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ రక్తం అందించడానికి 2018లో సహాయ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశాను. ఇప్పటి వర కు 5వేల మందికి రక్తం అందించాం. ఐదు రాష్ట్రాల్లో మా ఫౌండేషన్‌ సభ్యులు ఉన్నారు అత్యవసరం వస్తే అక్కడికి వెళ్లి రక్తదానం చేస్తారు. – టంకర శివప్రసాద్‌

ఎప్పుడు అవసరమైతే అప్పుడు..

నాది ఓ–నెగిటివ్‌ గ్రూప్‌. ఇది కొంత అరుదుగా లభిస్తుంది. దీంతో అత్యవసరం ఉన్న వారు ఎక్కువగా ఉంటారు. రెడ్‌క్రాస్‌ నుంచి కూడా ఫోన్‌ చేస్తారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి, రెడ్‌క్రాస్‌, హైదరాబాద్‌ ఇలా అవసరం ఉన్నచోటకు వెళ్లి ఇచ్చి వస్తాను. నేను మొదట వాసవీమాత ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రక్తదానం చేశాను.

– సుంకు రామ్మోహన్‌, బ్రాహ్మణవాడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement