వనపర్తిటౌన్: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వ హించిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ సిల్వర్ పథాకాన్ని సాధించారు. జావెలిన్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాఽ దించడంతో జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ అథ్లెట్‌కు మెడల్ ప్రధానం చేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా కార్యదర్శులు శరత్, రమణ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ
నారాయణపేట ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లోని ఉస్మానియా మీట్‌లో శుక్రవారం జరిగిన సీనియర్, జూనియర్ మెన్, ఉమెన్ విభాగంలో నారాయణపేట క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించినట్లు నారాయణపేట జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు. మెన్ సీనియర్ విభాగంలో జనార్ధన్‌కు హై జంప్‌లో గోల్డ్ మెడల్ అలాగే 400 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఉమెన్ విభాగంలో అండర్–16 విభాగంలో పూజ సిల్వర్ మెడల్ సాధించింది. రాష్ట్ర సెక్రెటరీ, ప్రెసిడెంట్, సారంగపాణి, స్టాలిన్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో శరత్ కుమార్, వెంకటేశ్వర్లు, అథ్లెటిక్ కోచ్ హారిక దేవి పాల్గొన్నారు.


