వనపర్తి మీనాలకు భలే క్రేజ్‌.. | - | Sakshi
Sakshi News home page

వనపర్తి మీనాలకు భలే క్రేజ్‌..

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

జలసిరుల ఖిల్లా..

మత్స్య సంపదకు అపార అవకాశాలు

రవ్వ, బొచ్చెల జోరు..

మార్కెట్లో కొరమ్రీను మేనియా

రుచికి కేరాఫ్‌ అడ్రస్‌

వనపర్తి చేపలు

మదనాపురం: పచ్చని పొలాలు.. గలగలపారే కృష్ణమ్మ అలలు.. చె రువుల ఆకుపచ్చని జిల్లా ఇ ప్పుడు జలసిరుల కాణాచి గా మారుతోంది. ఒకవైపు ఆకాశాన్నంటే ఆశలతో అన్నదాతలు సాగు చేస్తుంటే మరోవైపు జి ల్లాలోని అపార జల రాశి మత్స్యకారుల జీవితా ల్లో సరికొత్త కాంతులు నింపుతోంది. నీలి విప్లవానికి కేరా ఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ.. ఇక్క డి జలాశయాలు వేలా ది మత్స్య కార కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తున్నాయి.మార్కెట్లో కొరమ్రీనుకు ఉన్న విపరీతమైన క్రేజ్‌, మన చెరువుల చేపలకు ఉన్న ప్రత్యేక రుచి ఆక్వా రంగానికి సరికొత్త వైభవాన్ని తెచ్చిపెట్టా యి. జిల్లావ్యాప్తంగా విస్తరించి ఉన్న చిన్న, పెద్ద చెరువులు, కుంట లు నేడు నీలి విప్లవానికివేదికలయ్యాయి. మిషన్‌ కాక తీయతో పునరుజ్జీవం పొందిన చెరువుల్లో మ త్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా విడుదల చేస్తున్న చేపపిల్లలు ఇప్పుడు కో ట్లాది రూపాయల సంపదగా మారుతున్నాయి.

రుచి.. ఎందుకంత క్రేజ్‌?

సాధారణంగా ఆర్టిఫిషియల్‌ ఫీ డ్‌ (కృత్రిమ మేత) వేసి పెంచే చేపల కంటే వనపర్తి జలాశయాల్లో పె రిగే చేపలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. జూరాల బ్యాక్‌ వాటర్‌ రామన్‌పాడు, గణపసముద్రం వంటి జలాశయాల్లో నీరు నిరంతరం కదులుతూ ఉంటుంది. ఇందులోని సహజ సిద్ధమైన నాచు, ప్లవకాలు తిని పెరగడంతో ఇక్క డి చేపల మాంసం గట్టిగా, అమృతప్రాయమైన రు చితో ఉంటుంది. ఇక్కడి నుంచి రోజూ టన్నుల కొద్దీ రవ్వ, బొ చ్చె, జెల్లలు హైదరాబాద్‌తోపాటు ప క్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలిపోతుంటా యి.వనపర్తి చేప అంటే మార్కెట్లో వ్యాపారులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తారు.

కొర్రమీను పెంచితే లాభాల పంటే!

ప్రస్తుతం ఆక్వా రంగంలో అత్యఽ దిక లాభాలు తెచ్చిపెడుతున్న రకం కొరమ్రీను. దీనికి ఉన్న అద్భుతమైన డిమాండ్‌ కారణంగా కిలో ధర రూ.400నుంచి రూ. 600వరకు పలుకుతోంది. ఇది గాలిలోని ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోగలదు. కాబట్టి నీటి లభ్యత తక్కువగా ఉన్న చిన్నచిన్న కుంటల్లో కూడా దీనిని అత్యధిక సాంద్రతతో పెంచి లాభాలు సాధించవచ్చు. ఇందులో ముళ్లు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువ. శస్త్రచికిత్సలైనవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చేపను తింటే త్వరగా కోలుకుంటారు. ఎముకల పుష్టికి, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ డి, అధిక ప్రోటీన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, చిన్నపిల్లల్లో మెదడు చురుకుదనాన్ని పెంపొందిస్తాయి.

వనపర్తి జిల్లాలో పెద్ద చెరువులు కుంటలు అన్ని కలిపి 943 ఉన్నాయి. 13,600 మంది మత్య్సకారులు ఉన్నారు. నీటివనరులు ప్రకృతి ప్రసాదించిన వరం. ప్రధాన జలాశయాలతోపాటు వందలాది చెరువులు ఈ రంగానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. జిల్లాకు మకుటాయమానంగా నిలిచిన జూరాల ప్రాజెక్ట్‌, రామన్‌పాడు జలశయం, గోపాల్‌దిన్నె, గణపసముద్రం, రంగసముద్రం, సరళాసాగర్‌, శంకర సముద్రంతో వంటి ప్రసిద్ధ జలాశయాలు నిత్యం మత్స్య సంపదతో కళకళలాడుతున్నాయి. ఈ నీటి నిల్వల్లో పెరిగే చేపలకు సహజ సిద్ధమైన ఆహారం దొరకడంతో వీటి నాణ్యత అద్భుతంగా ఉంటుంది.

జిల్లాలోని 943 పెద్ద, చిన్న చెరువులతోపాటు కుంట లు, జూరాల, రామన్‌పాడు జలాశయాల్లో నాణ్యమైన చేపల పెంపకానికి అన్నిరకా ల చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా కోట్లల్లో చేపపిల్లలను వదులుతున్నాం.వనపర్తి జలాశయాల్లో పెరిగే రవ్వ, బొచ్చె, కొరమ్రీనుకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్‌ ఉంది. మత్స్యకారులు ఆధునిక పద్ధ తులు అవలంబించి, డిమాండ్‌ ఉన్న రకాలను పెంచితే ఆర్థిక వృద్ధి సా ధించవచ్చు. మత్స్యశాఖ సాంకేతిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటుంది.

– లక్ష్మయ్య, ఏడీ మత్స్యశాఖ, వనపర్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement