మినీ స్టేడియానికి 4 ఎకరాల భూమి | - | Sakshi
Sakshi News home page

మినీ స్టేడియానికి 4 ఎకరాల భూమి

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

కోడేరు/వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలకేంద్రం సమీపంలో మినీ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత భూమిని ఇచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ పేరుపై నాలుగెకరాల భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేశారు. స్థానిక యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీపనగండ్ల సమీపంలోని సర్వేనంబర్‌ 532లో దా దాపు రూ.1.50 కోట్ల విలువజేసే తన భూమి లో మినీ స్టేడియం నిర్మాణానికి స్పోర్ట్స్‌ అథారిటీ నుంచి రూ. 2కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. అయితే సమయాభావం వల్ల వీపనగండ్ల తహసీల్దార్‌ డిజిటల్‌ లాగిన్‌ను కోడేరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఓపెన్‌ చేయించి.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేశారు. ఇందుకు సాక్షులుగా జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాళ్ల నర్సింహ, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గోపి ఉన్నారు. రూ.కోట్ల విలువైన భూమిని క్రీడా అభివృద్ధి కోసం ఇవ్వడంతో యువకులు మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.

మాట నిలబెట్టుకున్న రాష్ట్ర

ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement