● క్వింటాకు గరిష్టంగా రూ.1700
● కనిష్టంగా రూ.1000
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. ధాన్యం సీజన్ లేకపోవడంతో మార్కెట్‌కు కేవలం ఉల్లిపాయలు మాత్రమే అమ్మకానికి వచ్చింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. నాణ్యమైన ఉల్లి క్వింటాకు గరిష్టంగా రూ.1700 వరకు పలికింది. కొన్ని వారాలుగా రూ.వేయి నుంచి 12వందల వరకు ఉన్న ఉల్లి ధర కొంత వరకు పెరగింది. ఇక కనిష్టంగా రూ.వేయి వరకు పలికింది. కనిష్ట ధరలు నిలకడగానే ఉన్నాయి. మార్కెట్ నిబంధనల ప్రకా రం 50కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ. 850, కనిష్టంగా రూ. 500 వరకు అమ్మకాలు సాగించారు. మార్కెట్ బయట కూడ రైతులు నేరుగా మార్కెట్ ధరలకే ఉల్లిని విక్రయించారు.


