వర్షాకాలంలో రైతులు అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో రైతులు అప్రమత్తం

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

జాగ్రత్తలు :

అలంపూర్‌: నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకడంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో పిడుగులు పడటం, ఈదురు గాలులు, పాములు వంటి ఆపదల్లో అన్నదాతలు చిక్కుకుంటున్నారు. వీటి నుంచి బయట పడటానికి రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ సూచిస్తున్నారు. వానకాలం పంట సాగులో రైతన్నలకు కింది జాగ్రత్తలు సూచించారు.

నడకదారిలో విష సర్పాలు:

వర్షాలు కురవగానే పాములు బయటికి వస్తాయి. గట్ల వెంట, చెట్లు, పిచ్చి మొక్కలు, బండరాళ్లు, గడ్డి వాములు ఉన్న చోట పాముల సంచారం ఎక్కువ గా ఉంటుంది. రైతులు పొలం పనులకు వెళ్లే దారిలోనూ, పనుల్లో నిమగ్నమై గట్ల వెంట నడుస్తూ పా ముకాటుకు గురైన ఘటనలు అనేకం ఉంటాయి.

జాగ్రత్తలు :

● చీకటి సమయాల్లో టార్చి లైట్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

● చేతిలో కర్ర పట్టుకొని వెళ్లాలి.

● తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలి. బూట్లు ధరిస్తే ఇంకా మంచిది.

● పొలం గట్లపై నడుస్తున్నప్పుడు చప్పుడు చేసుకుంటూ వెళ్లాలి.

● పాము కాటుకు గురైతే తక్షణమే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందాలి.

● మంత్రాలు, నాటు వైద్యంపై ఆధారపడొద్దు

వాగులు.. వరద ఉధృతి :

వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. వ్యవసాయ పనులకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు పొలాల నుంచి వచ్చే సమయాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించాలి.వరద ఉధృతి ఎక్కు వగా ఉంటే వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దు.

జాగ్రత్తలు

● నీటి ఉధృతి ఎలా ఉందో ముందుగా గమనించాలి.

● ఒంటరిగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు.

● జట్టుగా తోటి రైతులతో కలిసి వెళ్లాలి.

● పశువులను దాటించే సమయాల్లో మరింత జాగ్రత్త అవసరం

పిడుగులు, మెరుపులు :

వ్యతిరేక విద్యుత్‌ అవేశాలు ఉన్న రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు విద్యుత్‌ జనించి తక్కువ విద్యుత్‌ అవేశం ఉన్న మేఘం నుంచి ఎక్కువ ఆవేశం ఉన్న మేఘంలోకి విద్యుత్‌ ప్రవాహం వేగంగా జరుగుతుంది. అది వెంటనే ఉరుములు, మెరుపుల రూపంలో బయటికి వస్తోంది. కాంతికి వేగం ఎక్కువ కావడం వలన మెరుపు ముందుగా కనిపించి ఆ తర్వాత ఉరుము వినిపిస్తోంది. ఎక్కువ విద్యుత్‌ ఆవేశం ఉన్న మెరుపు తక్కువ ఆవేశం గల భూమి వైపుకు వస్తుంది. తేమ విద్యుత్‌ వాహకంగా పని చేయడం వలన అది పిడుగుగా మారి ఎత్తైన ప్రదేశాల వైపు దూసుకపోయి భూమిలోకి తటస్థంగా వెళ్తుంది. సహజంగా భూమిపై చెట్లు ఎత్తుగా ఉండటంతో వాటిపై పిడుగు పడుతుంది.

పాడి–పంట

వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు పిడుగులు పడుతుంటాయి. అలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

ఆకాశం మేఘామృతం అయినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.

వర్షంలో తడవకుండా ఉండటానికి చాల మంది చెట్లను ఆశ్రయిస్తారు. అది సరైంది కాదు. పిడుగులు ఎక్కువగా చెట్లపైనే పడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.

ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండరాదు.

సెల్‌ఫోన్లు ఉంటే వాటిని స్విచ్చాఫ్‌

చేసుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement