అడవిలోకి అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అడవిలోకి అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

అచ్చంపేట రూరల్‌: అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించడం, నాటు తుపాకులు, ఇతర ఆయుధాలు తీసుకెళ్లడం, వన్యప్రాణులను వేటాడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారులు చంద్రశేఖర్‌, రామ్మోహన్‌, రామమూర్తి హెచ్చరించారు. అల్లంగట్టు అటవీ ప్రా ంతంలో కెమెరా ట్రాప్‌లో చిక్కిన వేటగాళ్లు నాటు తుపాకి, మందుగుండ్లు, గొడ్డలితో అడవిలో సంచరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ వేట నియంత్రణకు అటవీశాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. చేపడుతున్న నిఘా చర్యలు మరోసారి ఫలితాన్నిచ్చాయ న్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆల్‌ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌–2026లో భాగంగా అచ్చంపేట రేంజ్‌ పరిధిలోని రంగాపూర్‌ సెక్షన్‌, ఐనోల్‌ దక్షిణ బీట్‌లోని అల్లంగట్టు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో కొందరు అనుమానాస్పదంగా ఆయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయన్నారు. కెమెరా ట్రాప్‌లో నమోదైన 30 ఫొటోలను విశ్లేషించగా, అచ్చంపేట మండలంలో ని చేదురుబావి తండాకు చెందిన ఇద్దరు, చందాపూర్‌కు చెందిన ఒకరు, లింగోటంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విచారణలో ముడావత్‌ బాలు, ధారంగుల నర్సింహ, సరియా, పాస్టర్‌ జాన్‌పాల్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. టైగర్‌ రిజర్వ్‌లో కెమెరా ట్రాప్‌ల సంఖ్యను పెంచడంతోపాటు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ విస్తరించినట్లు అధికారులు తెలిపారు.అడవిలోని కీలక మా ర్గాలు, నీటి వనరులు, వన్యప్రాణుల సంచార ప్రాంతాలు, వేటకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.కార్యక్రమంలో ఫారె స్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సుబూర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాప్‌ కెమెరాలకు చిక్కిన

వేటగాళ్లను పట్టుకున్న

అటవీ అధికారులు

నలుగురిపై వన్యప్రాణి

సంరక్షణ చట్టం కింద

కేసు నమోదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement