● రన్నరప్‌గా ప్రెస్‌క్లబ్ వారియర్స్
● ఉత్సాహంగా సాగిన క్రికెట్ టోర్నీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీపీఎల్ (ప్రెస్‌క్లబ్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ఉత్సహభరితంగా సాగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ టోర్నీలో మీడియా స్ట్రైకర్స్ చాంపియన్‌గా నిలిచింది. చివరి రోజు సోమవారం జరిగిన సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. తొలిసెమీఫైనల్లో పాలమైరు బుల్డోజర్స్‌పై ప్రెస్‌క్లబ్ వారియర్స్ గెలుపొందగా.. రెండో సెమీస్‌లో మహబూబ్‌నగర్ లెజండ్స్‌పై మీడియా స్ట్రైకర్స్ విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన తుది సమయంలో ఏడు వికెట్ల తేడాతో మీడియా స్ట్రైకర్స్ గెలుపొందింది. టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 12 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 92 పరుగులు చేసింది. 93 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీడియా స్ట్రైకర్స్ 11.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు ఎస్పీ డి.జానకి టాస్ వేసి ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం వార్తలతో బిజీగా ఉంటూ మానసిక ఇత్తిడికి గురవుతుంటారని, క్రీడల్లో ప్రశాంతత లభిస్తుందని.. కొంత సమ యం ఆటలు, వ్యా యామానికి కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం గెలుపొందిన జట్లకు నగర మేయ ర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జర్నలిస్టులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఇలాంటి క్రీడాపోటీల్లో పాల్గొంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. టోర్నీలో విశేష ప్రతిభ కనబర్చిన మీడియా స్ట్రైకర్స్ కెప్టెన్ నరేష్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ దక్కగా.. ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా ఆడిన శేఖర్‌గౌడ్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ముగింపు కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరేందర్‌చారి, కార్యదర్శి నరేందర్‌గౌడ్, సభ్యులు యాదయ్య, వెంకటేష్, మోహన్‌దాస్, సతీష్, సాయికుమార్, సీనియర్ జర్నలిస్టులు కిషోర్‌కుమార్, హరిప్రసాద్‌సాగర్, బండి విజయ్‌కుమార్, రఫీయోద్దీన్, బస్వరాజు, రవికుమార్, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.


