సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి

Jun 9 2026 8:46 AM | Updated on Jun 9 2026 8:46 AM

ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌నాయుడు

కందనూలు: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచి.. త్వరగా పూర్తిచేయాలని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌తో కలిసి ఇరిగేషన్‌, రెవెన్యూశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పురోగతి, పెండింగ్‌ సమస్య లు, రైతులకు పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, అవార్డుల జారీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదే శాల మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించి.. సాగునీటి ప్రాజెక్టు ల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. రైతాంగ అభ్యున్నతికి కీలకమైన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఎంజీకేఎల్‌ఐ, అచ్చంపేట లిఫ్ట్‌తో పాటు ఇత ర సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ ముల సేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వ్యవసాయాభివృద్ధికి వెన్నెముకలాంటివని అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పే ర్కొన్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు పరస్ప ర సమన్వయంతో పనిచేసి.. భూసేకరణ ప్రక్రియను వేగ వంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టుల వారీగా భూ సేకరణ స్థితిగతులను అధికారులు వివ రించారు. సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

కందనూలు:బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన పునరావాస, పునర్నిర్మాణ (ఆర్‌అండ్‌ఆర్‌) కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు అన్నారు. సోమ వారం కాలనీని చేపట్టిన పనులను అదన పు కలెక్టర్‌ అమరేందర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్మించిన గృహాలు, అంతర్గత రహదారు లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థతో పాటు ఇత ర మౌలిక వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కాలనీలో చేపట్టిన అభివృద్ధి పను ల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఆ యన వెంట సంబంధిత శాఖల అధికారు లు, ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement