హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

Jun 9 2026 8:46 AM | Updated on Jun 9 2026 8:46 AM

అడ్డాకుల: హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ అధ్యాత్మిక ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నా రు. అడ్డాకుల మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సనాతన ధర్మం ప్రపంచానికి శాంతి, సహనం, మావనవతా విలువలను అందించిందన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదన్నారు. భావితరాలకు దాన్ని చేరవేయాలని సూచించారు. యువత ధార్మిక విలువలను అలవర్చుకోవాలని చెప్పారు. కుటుంబ వ్యవస్థ బలోపేతానికి సనాతన ధర్మ బోధనలు ఎంతో ఉపయుక్తమన్నారు. హిందూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సమాజానికి మార్గనిర్ధేశనం చేసే కేంద్రాలన్నారు. నేటి యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సమాజ సేవ, గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో యువత ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో హిందూ సమ్మేళనం నిర్వాహకులు తదితరులు ఉన్నారు.

క్రీడాకారులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

గద్వాలన్యూటౌన్‌: ప్రతి క్రీడాకారుడు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధన చేయడంతోనే అనుకున్న ఫలితం వస్తుందని డీవైఎస్‌ఓ రామలింగేశ్వర్‌గౌడ్‌ అన్నారు. స్థానిక ఇండోర్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 28 నుంచి నిర్వహించిన వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులకు సర్టిఫికెట్లను ప్రధానం చేసి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమిని పాఠంగా తీసుకొని, గెలుపు కోసం ప్రయత్నించాలని క్రీడాకారులకు సూచించారు. మంచి అలవాట్లతో శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడంతో పాటు క్రీడల్లో రాణించి స్పోర్ట్స్‌ కోటాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రిటైర్డ్‌ డీవైఎస్‌ఓ కృష్ణయ్య 25మంది క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ అబ్రహం, స్టేడియం ఇన్‌చార్జి బషీర్‌, కోచ్‌ రజనీకాంత్‌, తిరుపతి, రాజశేఖర్‌, సర్వేష్‌రెడ్డి, సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement