ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని రెవెన్యూ అదన పు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ అధికారులను ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్ర జల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎక్కడైనా సమస్య లు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా సీఎం ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అలాగే మండలస్థాయి ప్రజావాణి దరఖాస్తులను కూడా పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి, వాటి వివరాలను ప్రజావాణి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. త్వరలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ వారం వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి 104 వినతులను అధికారులు స్వీకరించారు.

82.17 శాతం జనగణన పూర్తి

ప్రజావాణి అనంతరం జిల్లాలో నమోదుతున్న జనాభా గణన పురోగతిపై వెబెక్స్‌ ద్వారా మండల తహసీల్దార్లతో అదనపు కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 82.17 శాతం జనగణన పూర్తయిందన్నారు. హన్వాడ, చిన్నచింతకుంట, మహమ్మదాబాద్‌, గండేడ్‌ మండలాలు, భూత్పూర్‌, జడ్చర్ల మున్సిపాలిటీలు జనగణన నమోదులో వెనకబడి ఉన్నాయని, ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ ఈ రోజు సాయంత్రం లోగా 100 శాతం పూర్తిచేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రక్రియలో ఎక్కడైనా ఆన్‌లైన్‌ చేయడంలో చేయడంలో సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తితే వాటిని తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారితో సమన్వయం చేసుకొని పరిష్కరించుకోవాలన్నారు. అలాగే మున్సిపాలిటీల కమిషనర్లతో వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ రాంరెడ్డి, డీఆర్‌ఓ నిర్మల, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement