మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. మెరుగైన బోధన, వసతుల కల్పనతో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ కళాశాలలు అనగానే మెరుగైన విద్యా ప్రమాణాలు ఉండవని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించరని విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక అపనమ్మకం ఏర్పడింది. కానీ, అవన్నీ అసత్యాలని నిరూపిస్తూ ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయి లో మూడో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శ నం. కాగా, ఆయా కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు.
1970లో స్థాపన..
1970 సంవత్సరంలో మానుకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్థాపించారు. ఇక్కడ ఎంతో మంది నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. ఇక్కడ చదివిన వారు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు సాధించారు. కాగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులను చేర్పించి కళాశాలను కాపాడుకోవాలని అధ్యాపక బృందం కోరుకుంటుంది.
కోర్సులివే..
మానుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు డిప్లొమా వృత్తి విద్యా కోర్సులు సీటీ, ఈటీ, ఎంఈటీ, ఎంఎల్‌టీ గ్రూపులు ఉన్నాయి. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు ఉండగా బాలబాలికలకు ప్రత్యేక వసతులు ఉన్నాయి. 46 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. కాగా, విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలను అప్‌గ్రేడ్ చేస్తూ తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో విద్యాబోధన చేస్తోంది. జిల్లాలో మొత్తం 10 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వాటిలో అత్యధికశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పెరిగిన వసతులు
అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ప్రచారం
ఉచిత విద్య, పాఠ్యపుస్తకాల పంపిణీ
సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాకు మూడో ర్యాంకు
ఉచిత అడ్మిషన్
నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందం
విశాలమైన తరగతి గదులు, సౌకర్యాలు
అత్యాధునికమైన ప్రయోగశాలలు
అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్ నిర్వహణ
గ్రంథాలయం, స్టడీ అవర్స్
వారానికి ఒకరోజు సప్లిమెంట్ టెస్టు నిర్వహణ
వెనుకబడిన విద్యార్థులకు కేర్‌టేకర్‌తో ప్రత్యేక శిక్షణ
మనటీవీ ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన
ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు
సామాజిక అంశాలపై సాహిత్య, సాంస్కృతిక పోటీలు
దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు బస్‌పాస్ సౌకర్యం
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
ప్రత్యేకతలు ఇవే..


