గూడూరు: పంట మార్పిడితో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు నేర సారవంతమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర అన్నారు. మండలంలోని మట్టెవాడ శివారు నేలవంచలో శనివారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో పంటల మార్పిడిపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. వరి కొయ్యలు కాల్చొద్దని, నానో యూ రియా వాడకం వల్ల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్‌మాలిక్, సాంకేతిక వ్యవసాయ అధికారి రాజు, ఏఈఓలు పాల్గొన్నారు.
రైతులు దృష్టిపెట్టాలి..
బయ్యారం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తపేట, కొత్తగూడెం, కోయగూడెం, కంబాలపల్లి, వెంకటాపురం, కంబాలపల్లి, అల్లిగూడెం పంచాయతీల్లో శనివారం ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. యూరి యా యాప్ బుకింగ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆయన వెంట ఏఓ రాజు తదితరులు ఉన్నారు.


