రాజకీయాలకతీతంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

Jun 14 2026 10:37 AM | Updated on Jun 14 2026 10:37 AM

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

మహబూబాబాద్‌: ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, ఆతర్వాత రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధి 36వ వార్డులో శనివారం రూ.60 లక్షలతో నిర్మాణం చేయనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే మురళీనాయక్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మానుకోటను ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తానన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. మంచి పనుల విషయంలో తన సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య. డీఈఈ ఉపేందర్‌, స్థానిక కౌన్సిలర్‌ ముత్యం వెంకన్న, నాయకులు రామ్మోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, జె.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement