16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు | - | Sakshi
Sakshi News home page

16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు

Jun 14 2026 10:37 AM | Updated on Jun 14 2026 10:37 AM

16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు

భూపాలపల్లి అర్బన్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్‌ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ, మిరాకిల్‌ వలంటరీ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement