చిట్‌ఫండ్స్‌ బాధితుల వెతలు | - | Sakshi
Sakshi News home page

చిట్‌ఫండ్స్‌ బాధితుల వెతలు

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

కాజీపేట అర్బన్‌ : రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఆధ్వర్యంలో రిజిష్టర్డ్‌ చిట్‌ఫండ్‌ కంపెనీల్లో తమ సొమ్మును చిట్టీల రూపంలో పొదుపు చేసుకున్న బాధితులకు ఊరట కల్పించేందుకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ గతేడాది ఎఫ్‌డీ రిలీజ్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో గతేడాది అక్టోబర్‌ నుంచి నేటి వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 168 రిజిష్టర్డ్‌ చిట్‌ఫండ్‌ కంపెనీల బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, ఫిర్యాదు చేసినా.. చిట్‌ఫండ్‌ కంపెనీలు, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

300 మందికి ఎఫ్‌డీలు అందించిన కనకదుర్గ..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అచల, అక్షర, శుభనందిని, భవితశ్రీ, కనకదుర్గలతోపాటు 168 రిజిష్టర్డ్‌ చిట్‌ఫండ్‌ కంపెనీలను రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా చిట్‌ఫండ్‌ కంపెనీలో ఒక చిట్టీ ప్రారంభించాలంటే దానికి సరిపడా సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో చెల్లించాలనేది నిబంధన. తద్వారా సదరు చిట్స్‌ కంపెనీ బోర్డు తిప్పేసినా, డబ్బులు తిరిగి చెల్లించకపోయినా ఎఫ్‌డీల నుంచి చెల్లిస్తారు. అచల, అక్షర, శుభనందిని, భవితశ్రీ, కనకదుర్గ చిట్‌ఫండ్‌ కంపె నీల బాధితులకు ఎఫ్‌డీలను తొలుత చెల్లించేందు కు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఉత్తర్వులను జా రీ చేసింది. కేవలం కనకదుర్గ చిట్‌ఫండ్‌ మాత్రమే గతేడాది డిసెంబర్‌ నుంచి 300 మందికిపైగా ఎఫ్‌డీ చెక్కులను అందజేసి చేతులుదులుపుకుంది. అయితే కనకదుర్గ చిట్స్‌పై కూడా వందల సంఖ్యలో ఫిర్యాదులు ఉండడం గమనార్హం.

డీఎల్‌ఎస్‌ఏను ఆశ్రయించిన

అచల బాధితులు..

అచల చిట్‌ఫండ్‌ కంపెనీకి చెందిన బాధితులు చిట్స్‌ సహాయ రిజిస్ట్రార్‌, జిల్లా రిజిస్ట్రార్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ చొరవతో మూడు కోట్ల ఎఫ్‌డీలను 80 మందికి అందజేశారు. ఇంకా 30 మంది బాధితులకు ఎఫ్‌డీల చెక్కులు అందాల్సి ఉండగా. కన్జ్యూమర్‌ కోర్టు ద్వారా 15 మందికి పరిహారం అందింది.

జాయింట్‌ అకౌంట్‌ తెరవని శుభనందిని..

రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఎఫ్‌డీ రిలీజ్‌ను ప్రారంభించినా.. శుభనందిని మాత్రం ఏడాదిగా జాయింట్‌ అకౌంట్‌ను తెరవలేదు. ఎఫ్‌డీ రిలీజ్‌ కోసం జిల్లా రిజిస్ట్రార్‌తోపాటు సంబంధిత చిట్స్‌ కంపెనీ చైర్మన్‌లు జాయింట్‌ అకౌంట్‌ను ప్రారంభించాలి. కానీ శుభనందిని ఇంత వరకు అకౌంట్‌ ఓపెన్‌ చేయకుండా.. తన రియల్‌ వెంచర్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటుంది.

ఎఫ్‌డీల కోసం ఎదురుచూపులు

ఏడాదిగా ఖాతా తెరవని శుభనందిని

కుప్పలుగా ఫిర్యాదులు

డీఎల్‌ఎస్‌ఏను ఆశ్రయించిన

అచల బాధితులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement