సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి.. | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి..

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

హన్మకొండ అర్బన్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మంచిర్యాల జిల్లాలో కలిశారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ మహేందర్‌రావు పుట్ట ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ భద్రత, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్‌ వేతనాల చెల్లింపు, సేవా ప్రయోజనాల కల్పన తదితర అంశాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాన్ని పరిశీలించిన భట్టి విక్రమార్క.. సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై మరింత సమగ్రంగా చర్చించేందుకు హైదరాబాద్‌లో సమావేశం కావాలని సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్‌తోపాటు సంతోష్‌, డాక్టర్‌ రామకృష్ణ, మధుబాబు, శశికాంత్‌, వినోద్‌, సతీష్‌కుమార్‌ తదితర ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎంకు ఎన్‌హెచ్‌ఎం

ఉద్యోగుల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement