● పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 119 ఫిర్యాదులు
కర్నూలు(టౌన్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఫార్మాసిస్టు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.85 లక్షలు తీసుకుని మోసం చేసిన ఫయాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని గోనెగండ్ల మండలానికి చెందిన మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులన్నింటినీ విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, మస్తాన్ వలి పాల్గొన్నారు.


