పాణ్యం: నెరవాడ మెట్ట ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన రమణ ట్రావెల్ బస్సు సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు స్థానిక ఆర్‌జీఎం కళాశాల వద్ద వెళ్తుండగా టైర్ ఒక్కసారిగా పగలడంతో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌పైకి దూసుకెళ్లి ఆగింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. బస్సుల్లో 30 మంది ప్రప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హైవేపై ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. బస్సును డివైడర్ పైనుంచి పక్కకు తొలగించారు.


