మహానంది: మహానందిలో ఆదివారం భక్తుల సందడి కొనసాగింది. సెలవురోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు. భక్తులు ముందుగా కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలోని కల్యాణ మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శ్రీ గంగ, కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లకు కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.


