పాఠశాల బియ్యం మాయంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

పాఠశాల బియ్యం మాయంపై విచారణ

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

పాఠశాల బియ్యం మాయంపై విచారణ

ఆదోని: పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో సన్న బియ్యం మాయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. బియ్యం మాయం విషయాన్ని ఆదివారం సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సోమవారం ఉదయం 9.30 గంటలలోపు రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదోని ఎంఈఓ–2 కె.రంగన్నను ఆదేశించారు. పట్టణంలో మూడు ఉన్నత పాఠశాలలుండగా నెహ్రూ మెమోరియల్‌, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు ఫయాజ్‌, సుధాకర్‌బాబును విచారణకు పిలిచినట్లు ఎంఈఓ వెల్లడించారు. సోమవారం ఆ ఇద్దరిని విచారించి నివేదికను కలెక్టర్‌, డీఈఓకు పంపుతానని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement