నేడు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలు (టౌన్‌): చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న డిమాండ్‌తో నిర్వహిస్తున్న ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పేర్కొన్నారు. కర్నూలులో ఉదయం 10:15 గంటలకు స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి మౌర్య ఇన్‌ మీదుగా జిల్లా పరిషత్తు కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు.

దోమల నివారణ చర్యలు తీసుకోండి

కొత్తపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మలేరియా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హుసేనమ్మ, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర రావుఅన్నారు. గురువారం ఎరమ్రఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కపిలేశ్వరం గ్రామాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి నిత్య పూజారి ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement