దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

కర్నూలు సిటీ: ఏపీ మోడల్‌ స్కూళ్లలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్‌.సుధాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని తరగతుల ప్రవేశాలకు(ఇంటర్‌తో కలిపి)ఈ నెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా 23న ప్రచురించి, 6 నుంచి 9వ తరగతులకు 24న పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితాలను 25న ప్రకటించి, 26న సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తామని డీఈఓ పేర్కొన్నారు.

పశుసంవర్ధక శాఖ జేడీగా రాజశేఖర్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): పశుసంవర్ధక శాఖ జిల్లా ఇన్‌చార్జ్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ కే రాజశేఖర్‌ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ అయిన రాజశేఖర్‌ నాలుగేళ్లుగా ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. ఈయనను పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించగా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

‘మత్తు’తో యువత భవిష్యత్తు నాశనం

కర్నూలు: మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి పూర్తి దూరంగా ఉండాలని హోంగార్డ్స్‌ సదరన్‌ రీజియన్‌ కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌, అడిషనల్‌ ఎస్పీలు హుసేన్‌ పీరా, కృష్ణమోహన్‌ సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్‌ టోల్‌ఫ్రీ నబర్‌ 1972కు తెలియజేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో బుధవారం డ్రగ్స్‌ వద్దు బ్రో అవగాహన బ్రోచర్లు, వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే పోలీసు అధికారులు, సిబ్బందితో యోగాసనాలు నిర్వహించారు. హోంగార్డ్స్‌ డీఎస్పీ ప్రసాద్‌, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఈగల్‌ టీమ్‌ సిబ్బంది ఎలీషా, రమేష్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

కర్నూలు కల్చరల్‌: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో బీజేపీ ఓబీసీ మోర్చా ఆఽఽధ్వర్యంలో బుధవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులోని బళ్లారి చౌరస్తాలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉల్చాల లక్ష్మణ్‌ నాయుడు ఆధ్వర్యంలో పూజలు చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనా కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌, ఉపాధ్యక్షులు మస్తాన్‌, వీరప్ప, అనిత, రఘు, విజయ్‌, పాండు, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.27 కోట్లు

కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలకు బుధవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,27,68,230 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ వాణి తెలిపారు. అలాగే వెండి14 కేజీల 420 గ్రాములు, బంగారం 46 గ్రాముల 280 మిల్లీ గ్రాములు వచ్చినట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారిగా జిల్లా ఎండోమెంట్స్‌ అధికారి సుధాకర్‌రెడ్డి వ్యవహరించారు. ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్‌ మల్లికార్జున పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement