కర్నూలు: దొపిడీ దొంగలను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. చాకలి శేఖర్ బి.క్యాంప్ శివారు డాక్టర్స్ కాలనీలోని వీసీ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటాడు. ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాధవీనగర్‌లో శిల్పా క్యాటరింగ్ ముందు శేఖర్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా బంగారుపేటకు చెందిన దాదపోగు శివకృష్ణ, బాలాజీ నగర్‌కు చెందిన సయ్యద్ ఇక్బాల్ బాషా, షేక్‌షావలి అలియాస్ టిల్లు, కొత్తపేటకు చెందిన సయ్యద్ రహిమాన్ తదితరులు కారులో చాకలి శేఖర్‌ను వెంబడించి చంపుతామని బెదిరించి రూ.5 వేలు లాక్కుని ఉడాయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను బుధవారం జొహరాపురం గ్రామ పరిధిలోని సీపీఎం కొట్టాల వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.3 వేలు నగదుతో పాటు కారును సీజ్ చేసి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు పంపినట్లు మూడో పట్టణ సీఐ శేషయ్య తెలిపారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
ఆదోని సెంట్రల్: రైలు కింద పడి బుధవారం పెద్దకడబూరు మండలం నౌటేకల్ గ్రామానికి చెందిన సి. మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని–మంత్రాలయం రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. సి. మల్లయ్య భార్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఒంటరి జీవితం భరించలేక మనస్తాపం చెంది సమీపంలోని ఆదోని–నగరూర్ అర్‌ఎస్‌ఎస్ మధ్యలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


