‘పది’ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు సిబ్బంది విధుల్లో చేరడం, తదితర కారణాలతో పాటు మూల్యాంకనం చేసిన తరువాత వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ట్యాబ్‌ల ద్వారా నమోదు చేసేందుకు వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో మధ్యాహ్నం స్పాట్‌ మొదలైంది. జిల్లాకు మొత్తం 9,568 సమాధాన పత్రాలు రాగా, మొదటి రోజు 3,283 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. ఇందుకోసం చీఫ్‌ ఎగ్జామినర్లుగా 25 మంది, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు 90 మంది, స్పెషల్‌ అసిస్టెంట్లు 45 మందిలో 32 మంది స్పాట్‌లో పాల్గొన్నారు. నేడు మూల్యాంకనం పూర్తి చేయనున్నారు.

విధుల్లో చేరిన

కర్నూలు డీఎఫ్‌ఓ

కర్నూలు కల్చరల్‌: కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల సోమవారం విధుల్లో చేరారు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఆఫీసర్స్‌కు మే 11 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు డెహ్రాడూన్‌ ఐజీఎన్‌ఎఫ్‌ఏలో నిర్వహించిన మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌లో ఆమె పాల్గొన్నారు. మేనేజ్‌మెంట్‌ మాడ్యూల్‌, థెమాటిక్‌ టూర్‌, లైన్‌ మినిస్ట్రీ మాడ్యుల్‌ , ఫారెస్ట్రీ మాడ్యుల్‌లో నాలుగు వారాల పాటు శిక్షణ పొందారు. ఈ శిక్షణ కాలంలో నంద్యాల డీఎఫ్‌ఓ నాగమునేశ్వరి కర్నూలు ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె నుంచి శ్యామల బాధ్యతలు స్వీకరించారు.

భక్తులకు మెరుగైన

సౌకర్యాలు కల్పిస్తాం

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని శ్రీమఠం పీఠాఽధిపతి సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం శ్రీరాఘవేంద్ర సర్కిల్‌లో సిఆర్‌ఓ ఆఫీసు ముందు భక్తులకు వసతి గృహాల లభ్యత తాజా సమాచారం తెలిపే అధునాతన ఎల్‌ఈడీ డిజిటల్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠాఽధిపతి మట్లాడుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీమఠం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లోని వసతి గృహాల సమాచారం భక్తులకు ఎప్పటికప్పుడు తెలియాలనే ఉద్దేశంతో ఈ ఎల్‌ఈడీ స్క్రీన్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. శ్రీమఠం వసతి గృహాల్లో ఽభక్తులందరూ స్వచ్ఛత పాటించాలన్నారు. కార్యక్రమంలో శ్రీమఠం మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసులు, ఇంజనీర్‌ సురేష్‌ కోనాపూర్‌ పాల్గొన్నారు.

అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగింపు

కర్నూలు కల్చరల్‌: విశ్వ విద్యాలయాల్లో అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు రాయలసీమ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య వి.వెంకట బసవరావు, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ షావలి ఖాన్‌ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ‘ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ 2026’ ప్రక్రియకు సంబంధించిన గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారన్నారు. https://apuniversitiesrecruitment.apcfss.in వెబ్‌సైట్‌లోని కామన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించటానికి, రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించడానికి ఈనెల 8వ తేదీకి బదులు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని అనుబంధ పత్రాలతో దరఖాస్తు హార్డ్‌ కాపీని రిజిస్టర్డ్‌ పోస్ట్‌/స్పీడ్‌ పోస్ట్‌/కొరియర్‌ ద్వారా ఈనెల 22వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. అర్హులు, అనర్హుల జాబితా 22వ తేదీన ప్రదర్శిస్తామని, 29వ తేదీ వరకు ప్రాథమిక అర్హతపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

పాలిటెక్నిక్‌ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(అర్బన్‌): ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్స్‌ల్లో చేరేందుకు దరఖాస్తు గడువు జూన్‌ 22 వరకు పొడిగించినట్లు ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ జాన్సన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కోర్స్‌ల్లో చేరేందుకు పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పాస్‌ అయిన వారు అర్హులన్నారు. దరఖాస్తులు www.angrau.ac.in వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 9966505285 నంబరును సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement