కర్నూలు(అగ్రికల్చర్): యూరియా వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియూ, డీఏపీ పంపిణీకి శ్రీకారం చుట్టింది. మొదటి రోజునే సర్వర్ సమస్యలు ఉత్పన్నం కావడం గమనార్హం. యాప్ ద్వారా యూరియా, డీఏపీ అమ్మకాలను జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి పలు చోట్ల పరిశీలించారు. కర్నూలు నగరంలోని మన గ్రోమర్ సెంటర్, శివరామకృష్ణ ఫర్టిలైజర్, కల్లూరు మండలంలోని లక్ష్మిపురం గ్రామాల్లో యాప్ ద్వారా యూరియా. డీఏపీ అమ్మకాలను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి ఏపీఏఐఎంఎస్ యాప్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు సబ్ డివిజన్ ఇన్‌చార్జీ ఏడీఏ దస్తగిరిరెడ్డి, కల్లూరు, కర్నూలు మండల వ్యవసాయ అధికారులు విష్ణువర్ధన్‌రెడ్డి, రూఫస్ రొనాల్డ్ తదితరులు పాల్గొన్నారు.


