బొమ్మనహళ్లి: బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్‌లో ఓ జీబ్రా, ఓ నీటి ఏనుగు పిల్లలకు జన్మనిచ్చాయి. కబిని అనే జీబ్రా ఆడ జీబ్రాకు జన్మనిచ్చింది. అలాగే దృశ్య అనే హిప్పో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. రెండు పిల్లలూ ఆరోగ్యంగా ఉన్నాయని జూ సిబ్బంది తెలిపారు. ఇప్పుడు పార్కులోని జీబ్రాల సంఖ్య 11కి పెరిగిందని డైరెక్టర్ ఎ.వి.సూర్యసేన్ తెలిపారు.
చీతాలు రెడీ
అలాగే దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాలు బన్నేరుఘట్ట వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. గత వారం క్వారంటైన్ ముగియడంతో వాటిని ప్రజలు చూసేందుకు అందుబాటులో ఉంచారు. చీతాలు మన దేశంలో అంతరించిపోయాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని కూనో అడవిలో, ఇక్కడ బన్నేరుఘట్టలో మాత్రమే ఉన్నాయి.
జీబ్రా, హిప్పోకు పిల్లల జననం


